కరోనా మహమ్మారి హనుమకొండలోని తీగల సాంబమూర్తి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే సాంబమూర్తి ఊపిరితిత్తుల సమస్యతో నాలుగేళ్లుగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌పై జీవిస్తున్నారు. భార్య సంధ్య కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. రూ. 80 వేల కరెంటు బిల్లు బకాయి పడటంతో విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని అధికారులు తెలిపారు. దీంతో 'కరెంటు తీసేస్తే మా నాన్న ప్రాణం పోతుంది' అంటూ చిన్నారులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు.