Hoskote Road Accident Four Killed: కర్ణాటకలోని హోస్‌కోటే వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు ఓవర్‌టేక్ చేస్తూ లారీని ఢీకొనడంతో ఈ విషాదం జరిగింది. మృతుల్లో కేశవరెడ్డి, తులసి, ప్రణతి, ఏడాది వయసున్న చిన్నారి ఉన్నారు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.