కర్నూలు: పండుగ పూట పెను విషాదం.. తుంగభద్రలో స్నానానికి దిగి నలుగురు మృతి

4 months ago 20
కర్నూలు జిల్లా కోసిగిలో విషాదం చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో మునిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిని కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. పెళ్లి కోసం కందుకూరు గ్రామానికి వచ్చిన కొంతమంది.. నదిలో స్నానం చేసేందుకు శుక్రవారం ఉదయం తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. అయితే నదిలోకి దిగిన తర్వాత ఈత రాకపోవటంతో నీటిలో మునిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నారు.
Read Entire Article