Adoni Gold Biscuits Seized: ఏపీలో బంగారు బిస్కెట్ల వ్యవహారం కలకలంరేపింది. రెండు రోజుల క్రితం రైల్లో భారీగా బంగారు బిస్కెట్లు దొరికాయి. పక్కాగా సమాచారం రావడంతో కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ అధికారులు పుణె ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేశారు. మొత్తం 12మందిని అరెస్ట్ చేశారు.. వీరంతా కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బంగారు వ్యాపారులని చెబుతున్నారు. వీరు కేరళ నుంచి బంగారు బిస్కెట్లను రైల్లో అక్రమంగా ఆదోనికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.