తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో దాదాపు 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సీఆర్‌పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ ఈ ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.