Kalyandurgam Fire Accident: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అగ్గిపుల్లతో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించారు. పాత బస్టాండ్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ నుంచి 5 లీటర్ల పెట్రోల్‌ను ఓ వ్యక్తి తన బైక్‌పై తీసుకెళ్తున్నాడు. మధ్యలో ఆగి ఓ షాపు దగ్గర క్యాన్ పెట్టి ఓ షాపులోకి వెళ్లాడు. ఇంతలో క్యాన్ నుంచి పెట్రోల్ లీక్ అయ్యింది.. ఇంతలో ఓ వ్యక్తి పెట్రోల్‌ను గమనించకుండా బీడీ వెలిగించి అగ్గిపుల్ల కింద పడేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి.