దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యానికి లోనైన విషయం తెలిసిందే. కవితను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించారు. అయితే.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగవటంతో.. నిబంధనల ప్రకారం మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు.. కవితను పరామర్శించేందుకు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు.