తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్.. ఉత్కంఠ రేపుతోంది. కవిత పార్టీ గీత దాటిందని పేర్కొన్న బీఆర్ఎస్.. ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత ఏం చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ సస్పెండ్ చేయడంతో.. ఆమె తర్వాతి అడుగులు ఎటు వైపు అనే చర్చ జోరందుకుంది. సొంత పార్టీపై, నేతలపై విమర్శలు గుప్పించిన కవిత.. ఏం సాధించారు.. ఏం సాధించాలని అనుకుంటున్నారు? ఇంతకీ ఆమె లక్ష్యం ఏంటి అనే దానిపై ఎలాంటి విశ్లేషణలు వస్తున్నాయో చూద్దాం.