ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె బెయిల్ మంజూరులో అత్యున్నత న్యాయస్థానం మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేయడం, ఈడీ దర్యాప్తును ఇప్పటికే పూర్తి చేయడం, మహిళగా కూడా పరిగణించి బెయిల్ ఇస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది.