కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన GHMC ఏఈ.

8 months ago 10
హైదరాబాద్‌లోని అంబర్‌పేట జీహెచ్‌ఎంసీలో ఏఈ మనీషా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడింది. కాంట్రాక్టర్ బిల్లుల మంజూరుకు ఆమె రూ.15,000 డిమాండ్ చేయగా, ఇప్పటికే రూ.5,000 అందుకుంది. బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో.. అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు ప్రజలకు లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని.. టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా సంప్రదించాలని కోరారు. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
Read Entire Article