కాకినాడలో కూటమి నేతలకు తప్పిన ప్రమాదం.. వేదిక ఎత్తే కాపాడింది!

1 month ago 3
కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ (కుడా) తుమ్మల బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. పరిమితికి మించి జనం వేదిక మీదకు చేరుకోవడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో దాని మీద ఉన్న నేతలు అందరూ కిందపడిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీతో పాటుగా జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఆ వేదికపై ఉన్నారు. అయితే కార్యకర్తలు, నేతలు ఎక్కువ మంది వేదిక మీదకు రావడంతో ఘటన జరిగింది. దీంతో నేతలు అందరూ కిందపడిపోయారు. ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాటు చేసిన వేదిక ఎత్తులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
Read Entire Article