Kanipakam Temple Received Iso Certificate: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయానికి అరుదైన గుర్తింపు లభించింది. ఆలయం చేస్తున్న నాణ్యమైన పాలన, పారిశుధ్యం, అన్నదాన వితరణ సక్రమంగా నిర్వహిస్తునందుకు ఐఎస్‌వో గుర్తింపు వచ్చింది. ఐఎస్‌వో సంస్థ ప్రతినిధి శివయ్య కాణిపాకం దేవస్ధానంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, కాణిపాకం దేవస్ధానం ఈవో గురుప్రసాద్ కి ఈ సర్టిఫికెట్‌ను అందజేశారు.