కామారెడ్డి జిల్లా గాంధారిలో ఘోర రోడ్డు ప్రమాదం చెటుచేసుకుంది. స్పీడుగా దూసుకొచ్చిన కారు పోలీసుల పెట్రోలింగ్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు.. మరో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఇది ప్రమాదమా..? కావాలని యాక్సిడెంట్ చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.