కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. హైవే పక్కన ఆపివుంచిన ట్రక్కులోంచి రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లను నిద్రపోతున్న డ్రైవర్ కి తెలియకుండా ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా టేక్రియాల్ జాతీయ రహదారి దగ్గర ఈ ఘటన జరిగింది. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో మొబైల్ ఫోన్లు తీసుకెళ్లి ఏం చేసుకుంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు.