ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ఆయన జీవితంలో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచారంటూ జగన్ సెటైర్లు వేశారు.తాడేపల్లిలో జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకర్లు పవన్ కళ్యాణ్ వైసీపీకి ప్రతిపక్ష హోదా గురించి చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. జగన్ ఈ విధంగా స్పందించారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.