తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కార్పొరేట్ తరహాలో ప్రీస్కూల్స్ నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జిల్లాకు ఒకటి చొప్పున 33 స్కూల్స్ నిర్మించనున్న ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.30 లక్షలు వెచ్చించనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, బాలికలు, గర్భిణులు, బాలింతల కోసం తెలంగాణ పోషణ పథం కింద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.