ఇటీవల కాలంలో పిల్లల్లో నేర స్వభావం పెరుగుతోంది. ఈ పరిస్థితి సమాజంలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేయాల్సిన పెంపకంలో.. లోపాలు ఈ ప్రమాదకర ధోరణికి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో పిల్లలను శిక్షించడం క్రమశిక్షణలో పెట్టడంగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆధునిక తల్లిదండ్రులు పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తల్లిడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో పాత పద్ధతులు అనుసరించి పిల్లల్ని పెంచడం మంచిదా కాదా? అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది.