కాలికి గాయమైన ఓ యువకుడు వైద్యం కోసం ఆసుపత్రికి వెళితే చివరకు ప్రాణమే పోయింది. పనిలో భాగంగా కాలికి రేకు తగలటంతో పరమేష్ అనే యువకుడు ఆసుపత్రిలో చేరగా.. అతడి కాలికి సర్జరీ చేశారు. ఆ తర్వాత రెండ్రోజులకే మెదడులో రక్తస్రావం అయిందని మరో సర్జరీ చేయగా.. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే పరమేష్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ దుండిగల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.