కాళేశ్వరం విచారణకు మాజీ సీఎం KCR... బీఆర్కే భవన్ వద్ద హైటెన్షన్, భారీగా పోలీసులు

1 year ago 26
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు హాజరయ్యారు. కాసేపటి క్రితం ఆయన బీఆర్కే భవన్ చేరుకొని విచారణ గదిలోకి వెళ్లారు. ఆయన వెంట హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతలున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్‌ను ప్రశ్నించనుంది. ఇప్పటికే అధికారులు, మాజీ మంత్రులను విచారించిన కమిషన్.. నేడు కేసీఆర్‌ను క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది.
Read Entire Article