ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రిజర్వేషన్లు ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీసు, ఎక్సైజ్, అటవీ శాఖ వంటి యూనిఫాం సర్వీసుల్లో వర్తిస్తాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లేదా ఇతర నియామక సంస్థల ద్వారా చేపట్టే ప్రతి నియామకంలోనూ ఈ రిజర్వేషన్లు అమలవుతాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.