గ్రేటర్ హైదరాబాద్‌లో జూలై నాటికి అదనంగా 200 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వీటిలో 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయి. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు.. ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025 నాటికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా.. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.