రేషన్ కార్డ్ దారులకు e-KYC ప్రక్రియ గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఈ ప్రక్రియ ద్వారా అనర్హులను గుర్తించి.. వారి రేషన్ కార్డులను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ షాపులు, ఆధార్ కేంద్రాలు లేదా ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు.