తెలంగాణ నుంచి మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకు రైల్వేశాఖ చేదువార్త చెప్పింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నేడు వెళ్లాల్సిన డ్రైన్ రద్దు చేసింది. ప్రయాగ్‌రాజ్ మార్గంలో రైల్వే ట్రాక్‌లో రద్దీ కారణంగా రద్దు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేబోర్డు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళాకు వెళ్లేందుకు అంతా సిద్ధమైన సమయంలో చివరి నిమిషంలో చెబితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.