ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లిన హైదరాబాద్ యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరికొందరు యాత్రికులు మినీ బస్సులో చిక్కుకుపోయారు. మృతులు నాచారం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.