ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాకు కోట్ల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల తాకిడితో అక్కడ విపరీతమైన రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాకు చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు కుంభమేళాలో తప్పిపోయారు. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.