ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టి కుమారుడు మోసపోగా.. అప్పులు తీర్చే మార్గం లేక ఇంట్లోని నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ముగ్గురు చనిపోగా.. మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.