మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన కుమారుడి వివాహ రిసెప్షన్‌ను రద్దు చేసి.. ఆ డబ్బును రైతుల కోసం విరాళం ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. రిసెప్షన్ వేడుక కోసం ఖర్చు చేయాలని భావించిన రెండు కోట్ల రూపాయలను రైతుల కోసం విరాళంగా ప్రకటించారు. ఆ డబ్బును సీఎంకి అందించి.. యూరియా కొరతతో బాధపడుతున్న లక్షలాది మంది రైతులకు ఒక్కో బస్తా యూరియా ఫ్రీగా పంపిణీ చేయాలని కోరారు. దీనికి సంబంధించిన వివరాలు..