ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలోని స్వయంభువుగా వెలిసిన కురుమూర్తి స్వామి వారి బ్రహోత్సవాలు నేటి నుంచి ఈనెల 18 వరకు వైభవంగా జరగనున్నాయి. దాదాపు 10 లక్షల మంది జాతరలో స్వామివారిని దర్శించుకుంటారని అంచనా. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.