హైదరాబాద్ కుషాయిగూడ ఆర్టీసీ బస్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పార్కింగ్‌లో ఉన్న రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు అంటుకొని బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో డిపోలోని ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.