వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె.. యుక్త వయసు వచ్చేసరికి ప్రేమించిన వాడితో ఇల్లు వదిలి వెళ్లిపోయింది. దీంతో గుండె పగిలిన ఆ తండ్రి.. నచ్చిన వాడితో ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలనుకున్నాడు. అయితే పెళ్లైన ఆరు నెలలకే నాన్నా, నేను కష్టాల్లో ఉన్నా, నన్ను తీసుకెళ్లూ అంటూ ఫోన్ వస్తే కూతురిని తీసుకెళ్లడానికి పోలీసులను ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్‌లో కుమార్తె పరిస్థితిని చూసి గుండె పగిలి ప్రాణాలు విడిచాడు.