కూతురికి మరణ శాసనం రాసిన తల్లి.. భర్తను చంపిన చేతులతోనే చిన్నారి ప్రాణం తీసింది!

9 months ago 31
నాగర్‌కర్నూల్ జిల్లా చెన్నంపల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎల్లమ్మ అనే మహిళ తన ఏడేళ్ల కూతురు నందినిని గొంతు నులిమి హత్య చేసి, నీటి గుంతలో పడేసింది. ఈ దారుణం స్థానికంగా సంచలనం సృష్టించింది. గతంలో తన భర్తను కూడా హత్య చేసి జైలు జీవితం గడిపిన ఎల్లమ్మ.. బెయిల్‌పై విడుదలయ్యాక ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తల్లి అనే పదానికే మాయని మచ్చ తెచ్చిందని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article