కూతుర్ని వేధించాడని కువైట్ నుంచి వచ్చి వేసేశాడు!

1 month ago 4
తమకు అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీసులను ఆశ్రయించినప్పుడు వారు సకాలంలో, సరిగా స్పందించకపోతే బాధితుల్లో ఎంత ఆవేదన గూడు కట్టుకుంటుందో.. ఒక్కోసారి ఎంత తీవ్రంగా ప్రవర్తిస్తారో తెలియజేసే ఉదంతమిది. తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సరిగా స్పందించకపోవడంతో ఒక వ్యక్తి ఏకంగా కువైట్‌ నుంచి వచ్చి అతడిని హతమార్చాడు. తిరిగి కువైట్‌ వెళ్లిపోయిన అతడు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో శనివారం తెల్లవారుజామున దివ్యాంగుడైన 59 ఏళ్ల గుట్ట ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడు తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తానే కువైట్‌ నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్లానని నిందితుడే ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం సంచలనమైంది.
Read Entire Article