హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 'హైడ్రా' హాట్ టాపిక్‌గా మారింది. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ స్థలాలను అక్రమించి నిర్మించిన కట్టడాలను ఈ హైడ్రా కూల్చి వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చేపట్టిన కూల్చవేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక అందించింది. మెుత్తం 18 చోట్ల కూల్చివేతలు చేపట్టి 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు చెప్పారు.