కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు రియాక్షన్.. ఏమన్నారంటే?

4 hours ago 1
Andhra Pradesh CM On Union Budget:2025- 26 వార్షిక బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వికసిత భారత్ దార్శనికతను కేంద్ర బడ్జెట్ ప్రతిబింబిస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దేశానికి వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా పన్ను మినహాయింపు ఇచ్చారని.. కేంద్ర బడ్జెట్‌లో మహిళలు, యువత, రైతులు, పేదలు ఇలా అందరికీ ప్రాధాన్యం దక్కిందన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు ప్రశంసించారు.
Read Entire Article