తెలంగాణలో ఫార్ములా ఈ రేసు కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయగా.. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా చేసుకుని ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దీంతో.. ఈ కేసు మరింత సంచలనంగా మారింది.