కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి.. సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతోంది. రేవంత్ రెడ్డి సర్కార్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నానా రచ్చ నడుస్తోంది. సినిమా సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. అనేక జంతువులు, చెట్లకు ఆశ్రయంగా ఉన్న ఆ భూములను చదును చేయడాన్ని ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి దియా మీర్జాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. కేటీఆర్ పంపితేనే తాను వీడియోలు పోస్ట్ చేశానని.. దియా మీర్జా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.