టీ స్టాల్ మీద కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు సిరిసిల్ల కలెక్టర్ తన హోటల్ ముసేయించాడని జిల్లా కేంద్రానికి చెందిన ఓ చిరు వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు. ట్రేడ్ లైసెన్స్ లేదని కారణాన్ని చూపించి హోటల్ బంద్ చేయించాడని వాపోయాడు. కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకే మూసేయించారని.. ఇది సరైంది కాదని వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.