బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కేసీఆర్‌తో పాటు హరీష్ రావు సహ మొత్తం 8 మందికి కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజీ విషయంలో నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి.. భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. సెప్టెంబరు 5న విచారణ జరపనున్నట్లు పేర్కొంది. అయితే.. ఈ విచారణకు హాజరుకావాల్సిందిగా 8 మందికి నోటీసులు జారీచేసింది.