ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆమె విమర్శించారు. ప్రభుత్వం ఈ విచారణను సీరియస్‌గా చేయడం లేదని.. అసలు దీనిని పూర్తి చేసే ఉద్దేశం ఉందా లేదా అని ఆమె ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ బాధాకరమైన విషయమేనని వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఎన్నికల పనుల వల్ల తాను బిజీగా ఉన్నానని, విచారణకు మరో తేదీ కేటాయించాలని కేసీఆర్ కోరగా సిట్ సానుకూలంగా స్పందించింది. సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం తనను ఇంటి వద్దే విచారించాలని కేసీఆర్ అధికారులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.