సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.380.52 కోట్లు మంజూరయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మట్టి రోడ్లను తారు రోడ్లుగా, సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తున్నారు. కొత్త వంతెనల నిర్మాణం కూడా చేపట్టారు. దశాబ్దాలుగా రోడ్డు లేని గ్రామాలకు సైతం రోడ్లు నిర్మిస్తున్నారు. దీంతో సీఎం రేవంత్‌కు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.