మంత్రి కొండా సురేఖ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు శునకం.. ఉన్నట్టుండి గుండెపోటుతో కన్నుమూసింది. కుటుంబసభ్యుల్లో ఒకరిగా పెంచుకున్న కుక్క.. మరణించటాన్ని జీర్ణించుకోలేక మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శునకానికి పుష్పాంజలి ఘటించి.. కన్నీటినితో వీడ్కోలు పలికారు. కుక్కకు.. సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.