Nagarjuna Defamation Suit: తెలంగాణ రాజకీయాలతో పాటు టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. నాగార్జున పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. నాగార్జున నేరుగా కోర్టుకు వచ్చి తన వాదనను వినిపించాలని.. స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.