హైదరాబాద్ కొండాపూర్ క్వేక్ అరీనా పబ్‌పై ఈగల్ బృందాలు గురువారం మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఒక ఐఏఎస్ అధికారి కుమారుడితో పాటు మరో ఆరుగురు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయింది. పట్టుబడిన వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విద్యార్థులు ఉన్నారు. అంతర్జాతీయ డీజే ఈవెంట్ జరుగుతుండగా నిర్వహించిన ఈ దాడుల్లో గంజాయి, మెథామ్ఫెటమైన్ సేవించినట్లు పరీక్షల్లో తేలింది. వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.