తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. సీఎం చంద్రబాబు, టీడీపీ కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలకు బలంగా బదులిస్తోంది. వైఎస్ జగన్‌తో పాటుగా కీలక నేతలు.. ఈ వివాదంపై తమ వాణి వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని విలేకర్ల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు రాజకీయ కారణాలతోనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని ఈ సందర్భంగా మండిపడ్డారు. తిరుమల ఆలయాన్ని రాజకీయాల్లోకి లాగుతూ.. ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.