Telangana Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం తెలిపి, ఈ అంశంపై సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీలో విలీనం చేయనున్న మున్సిపాలిటీలు, గ్రామాలపై సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. జాబ్ క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. క్రీడాకారులు మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్‌కు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.