తెలంగాణలో కొత్త రేషన్ కార్డుదారులు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులందరూ బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి రేషన్ బియ్యం నిలిపివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. కాగా, ఆధార్ అప్‌డేట్ సమస్యల వల్ల ఈ-కేవైసీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.