తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలను మరింత ఆకర్షణీయమైన రంగులు, వైవిధ్యమైన డిజైన్లతో రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జతను ఈ నెలాఖరులోగా అందిస్తామని అధికారులు తెలిపారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల విద్యార్థులకు రెండు జతలు అందించినట్లు వెల్లడించారు. హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు, కార్పెట్లు, దుప్పట్లు, టవళ్ల పంపిణీ పూర్తయిందన్నారు. 2027–28 విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజునే యూనిఫాం, ఇతర సామగ్రి అందేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు.