AP Transport Department New Vehicle Permanent Registration In Week: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారం రోజుల్లోగా శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించకపోతే, సాఫ్ట్‌వేర్ ద్వారా ఆటోమెటిక్‌గా నంబర్ కేటాయించబడుతుంది. ఈ మార్పుతో వాహన కొనుగోలుదారులు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు, అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.