కొత్తగూడెం కేంద్రంగా రైల్వే డివిజన్‌.. కేంద్రానికి బీఆర్ఎస్ ఎంపీల రిక్వెస్ట్

3 weeks ago 6
కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొత్తగూడెం ప్రధాన కూడలిగా ఉందని.. బ్రిటిష్ కాలం నాటి చారిత్రక నేపథ్యం, సింగరేణి బొగ్గు రవాణా ద్వారా రైల్వేకు అందుతున్న భారీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 2032 నాటికి వందేళ్లు పూర్తి చేసుకోనున్న ఈ స్టేషన్‌ను డివిజన్ కేంద్రంగా ప్రకటించడం ద్వారా ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు లభిస్తుందని వారు పేర్కొన్నారు.
Read Entire Article