తెలంగాణలో మరికొద్ది నెలల్లో పంచాయతీ ఎన్నికల ఢంకా మోగనుంది. దీంతో ఆశావహులు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేవారు కోతుల సమస్యే ప్రధానంగా ప్రచారంలో దిగనున్నారు. కోతుల బెడదను తీర్చేవారినే సర్పంచ్‌గా కానీ ఎంపీటీసీగా కానీ గెలిపిస్తామంటూ ఓటర్లు కూడా తెగేసి చెబుతున్నారు.